మహా శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ శివాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా శివుని వేడుకున్నానని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల సాంబశివరెడ్డి, ఎగ్గెటి రమేష్, మ్యాకమల్ల అశోక్, ఎగ్గెటి సదానందం తదితరులు పాల్గొన్నారు.