రోజు రోజుకి రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాలు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతలు చేపడుతున్న ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న మాకేం భయం అన్నట్టుగా వ్యవహరిస్తున్న డ్రగ్స్ ముఠాలు. చాప క్రింద నీరు లాగా జమ్మికుంట పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం జమ్మికుంట పట్టణంలోని గ్రేన్ మార్కెట్ పరిధిలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు జమ్మికుంట పట్టణ పోలీస్ బృందం చాకచక్యంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించి సోదాలు జరపగా పిట్టల మహేష్. వద్ద 100 గ్రాముల గంజాయి. మరొక వ్యక్తి. లింగాల శ్రీనివాస్ కార్తీక్ అను వ్యక్తి వద్ద 110 గ్రాముల గంజాయి లభించింది. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వీరిపై కేసు నమోదు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన కేసులు పెడతామని హెచ్చరించారు