హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ జాతీయ చైర్పర్సన్ రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చిన వదిలేసి ఈ దేశ ఆర్థిక ప్రతిష్ట కోసం మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక వ్యవస్థను చక్కపెట్టే కార్యక్రమం చేశారని భారత్ జోడోయాత్రతో దేశం మొత్తం పాదయాత్ర చేసి ఇప్పుడున్న నిరుపేద కుటుంబాల కోసం ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలో తెలుసుకొని ఈ దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాంతంలో తన ఆలోచన విధానాలతో ఆ రాష్ట్రాలు ముందుకెళుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్య, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, మాజీ కౌన్సిలర్స్ దేశిని సదానందం, శ్రీహరి, పిట్టల రమేష్, సీనియర్ దొడ్డె సదానందం, కాంగ్రెస్ నాయకులు ముద్దమల్ల రవి, పాతకాల అనిల్, లింగారావు, పోతుల శ్రీనివాస్, మైస మహేందర్, పోతిరెడ్డి మల్లయ్య, ఎండి సలీం, యువజన నాయకులు దొడ్డే నవీన్, శ్రీకాంత్, రాజకుమార్, గడ్డం రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.