కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతి పై సోమవారం దాడి చేసిన అక్రమ మైనింగ్ నిర్వాహకుదు ఖలీమ్ మరియు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలొని చారిగాం గ్రామ శివారులో జెసిబి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న తిరుపతి వార్తా సేకరణ నిమిత్తం ఫోటోల కోసం అక్కడికి వెళ్ళగా అక్రమ మైనింగ్ నిర్వాహకులు ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేసి తిట్టడం ఏమాత్రం సరికాదన్నారు పోలీసులు తక్షణమే అక్రమ మైనింగ్ నిర్వాహకుడు ఖలీమ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని. కొమురం భీం జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మాఫియాకు మద్దత్తు ఇస్తున్న జిల్లా అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు చేసే పోరాటానికి జిల్లా వ్యాప్తంగా బీజేపీ మద్దతునిచ్చి అండగా ఉంటుంది అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సింగం శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తు అశోక్ ఈర్ల విశ్వేశ్వరరావు తాలూకా కన్వీనర్ వీరభద్ర చారి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వలస శ్రీదేవి, దెబ్బతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఠాగూర్ విజయ్ సింగ్, గజ్జల లక్ష్మణ్, చిప్పకుర్తి శ్రీనివాస్, రాజేందర్, సంజు, అనిల్, సంతోష్, నానాజీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


