Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAతాత జ్ఞాపకార్థం తల్లి ఒగ్గు రజిత పుట్టిన రోజునాడు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఒగ్గు శ్రీనిధి

తాత జ్ఞాపకార్థం తల్లి ఒగ్గు రజిత పుట్టిన రోజునాడు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఒగ్గు శ్రీనిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ కార్యాలయానికి ప్రతిరోజు పని రీత్యా వచ్చి పోయే ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తి శేషులు ఒగ్గు కథ కళాకారులు ఒగ్గు మల్లయ్య యాదవ్ జ్ఞాపకార్థం ఆయన మనుమరాలు ఒగ్గు శ్రీనిధి చలివేంద్రాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఒగ్గు శ్రీనిధి పొదుపు చేసుకున్న తన డబ్బుల నుంచి కొంత డబ్బును చలివేంద్రం ఏర్పాటు కు వినియోగించే రంజన్లకు ఖర్చు చేసి తన తల్లి ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదినం సందర్భంగా సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆమెను తాహాసిల్దార్ రామచంద్రం అభినందించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, దూస శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, మల్లేశం యాదవ్, రమేష్ యాదవ్, తదితరులు పాల్గొని శ్రీనిధి ని అభినందించారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments