విజయనగరం: విజయనగరం జిల్లాలోని గరివిడి మండల సర్వసభ్య సమావేశానికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. జగనన్న గృహ నిర్మాణాలపై అధికారులను బొత్స అడిగి తెలుసుకున్నారు. మండలానికి మంజూరైన ఇళ్లను లబ్దిదారులు వేగంగా నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని బొత్స స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలను ఇంకా ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని, వారం పదిరోజుల్లో ప్రారంభించకపోతే కొత్త లబ్ధిదారులకు వాటిని ఇవ్వాలని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకుంటే.. కొత్త లబ్ధిదారులకు ఇవ్వండి
RELATED ARTICLES