ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో, అంబేడ్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అంబేద్కర్ వాది,గడ్డం నర్సయ్య పరమపదించారు. కీర్తి శేషులు స్వర్గీయ గడ్డం నర్సయ్య సంస్మరణ కార్యక్రమాన్ని, నేవూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నిర్వహించారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, నర్సయ్య గ్రామాభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకునేవారు. సేవాభావం, ఆత్మీయత కలిగిన వ్యక్తిగా, గ్రామ పెద్దమనిషి గా ఉంటూ, వారి అనుభవాల్ని మాతో పంచుకుంటూ ఎంతో సహకరించేవారు. ఎంతో సహనం కలిగి, అందరి కులాల పెద్దమనుషులు తో గౌరవంగా మేదిలేవారు. ఇలాంటి వారు ఇక లేరు అనే విషయాన్ని గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీరు చూపిన బాటలో ముందుకు సాగుతము అని, ప్రగాఢ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో, గ్రామంలోని అన్ని కులాల ప్రజలు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, గ్రామంలోని అన్ని యూత్ అసోసియేషన్ ప్రముఖులు కలిసి సామూహిక భోజనాలు చేశారు. స్వయంగా వెంకట్ రెడ్డి దంపతులు భోజనాలు వడ్డించి వారి ఆప్యాయతను చాటుకున్నారు