కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సుమలత 34 రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు అత్యవసరంగా మూడు యూనిట్ల బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని వశిష్ట డిగ్రీ కళాశాల జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేశామని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్, క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. వేసవికాలం కావడం వలన రక్తనిధి కేంద్రాలలో రక్తనిల్వలు తగ్గిపోయాయని వివిధ ఆపరేషన్ల నిమిత్తమై, గర్భిణీ స్త్రీలకు,ప్రమాద బాధితులకు తరచుగా రక్తం అవసరం పడుతుందని కావున రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. రక్తదాత శ్రీనివాస్ కి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కేంద్రంలో టెక్నీషియన్లు జీవన్ వెంకటేష్ లు పాల్గొన్నారు.