సర్వ మానవాళి శ్రేయస్సు కోసం అల్లాహ్ ఖురాన్ ను భువికి పంపిన పుణ్యదినంగా షబెఖద్ర్ ను ముస్లింలు భావిస్తారు. మహమ్మద్ ప్రవక్త కృపను పొందడానికి నమాజ్( ప్రార్ధన), హజ్( మక్కా యాత్ర), జకాత్( దానధర్మాలు చేయడం) వంటి ఎన్నో మార్గాలున్నాయి. వీటన్నింటిలోకి ఉపవాస దీక్షలు ఎంతో ఉత్తమమైన మార్గంగా ముస్లింలు నమ్ముతారు۔ అందుకే రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి۔ నెల రోజుల ఈ దీక్షలో చివరి పది రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు۔ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామియా మస్జిద్ లో శనివారం రోజు పవిత్రదినం షబెఖద్ర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
వేయి మాసాల పుణ్యఫలం…
రంజాన్ నెల రోజుల ఉపవాస దీక్షలో చివరి పది రోజుల్లోని బేసి రాత్రులు 21, 23, 25, 27, 29 వ రోజుల్లో ఏదొ ఓ రోజున ఖురాన్ ను అల్లాహ్ భువికి పంపాడని ముస్లింలు విశ్వసిస్తారు. వీటన్నింటిలోను ఏదో ఒక రోజు రాత్రి షబెఖద్ర్ అని మహనీయులు స్పష్టం చేశారు. 27వ రోజున షబెఖద్ర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తారు. జామియా మస్జిద్ మతగురువులు మౌలానా నౌమన్ హష్మీ, మౌలానా యాసీన్ మాట్లాడుతూ అల్లాహ్ దూతలు మానవాళి కోర్కెలు తీర్చడానికి, నరక భయాన్ని తప్పించడానికి భూమి మీద సంచరిస్తారని, అల్లాహ్ ఆదేశం మేరకు మానవుల కోర్కెలు తీర్చడానికి వారు సంసిద్ధులై వస్తారని చెప్పారు۔ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున జాగరణ చేస్తూ తమ ఇహపరమైన ఇబ్బందులను తొలగించాలని అల్లాహ్ ను ప్రార్థిస్తారని చెప్పారు. షబెఖద్ర్ రోజున పవిత్ర ఉపవాస దీక్షతో జాగరణ చేస్తే వేయి నెలలు అంటే 83 ఏళ్ల 4 నెలల కాలంలో ఉత్తమ కర్మలతో పోందే పుణ్యఫలం దక్కుతుందని ముస్లింల నమ్మకమని మౌలానా యాసిన్ చెప్పారు. ప్రత్యకంగా 20 రకత్ తరావీ నమాజ్ నిర్వహించారు. ఆనంతరం మస్జిద్ సమీపంలో ఉన్న హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గాలోని సమాధులకు దర్శనం చేసుకున్నారు. వర్షాలు కురువాలని పాడి పంటలు బాగా పండాలని, రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. మత గురువులను శాలువాతో సన్మానించి ۔మిఠాయిలను పంచారు. మస్జిద్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు۔
ఈ కార్య క్రమంలో జమ్మికుంట మండల మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అంకుషావలి, జామియా మస్జిద్ & దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, కోశాధికారి మొహమ్మద్ మహమూద్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయిముద్దీన్, సభ్యులు అహమ్మద్, లతీఫ్ హుస్సేన్, జలీల్, ఇంక్విలాబ్ టీవీ రిపోర్టర్ md రఫీక్. తదితరులు పాల్గొన్నారు