ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలలవారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలల వారీగా సీట్ల ఖాళీల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. బీడీఎస్ రెండో విడత ప్రవేశాలకు ప్రకటన బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 27, 28 తేదీల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.