యువతను మహమ్మారి బారిన పడకుండా రక్షిద్దాం వారి భవిష్యత్తును కాపాడుదాం, డ్రగ్స్, గంజాయి నిర్మూలించడానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి.అంటూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన 5K రన్ కు భారీ స్పందన వచ్చింది. ఉత్సాహంగా పాల్గొన్న చిన్న, పెద్ద, యువతి, యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు. జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల మహాజన్.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, కొత్త చెరువు, చంద్రంపేట మీదుగా తిరిగి అంబేద్కర్ చౌక్ వరకు సాగిన 5కే రన్.
డ్రగ్స్ & గంజాయి మహమ్మారి మత్తులో కళ్ళముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే మౌనంగా ఉందామా! పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే సాటి పౌరునిగా ఎలా మౌనంగా ఉందాం.డ్రగ్స్ మరియు గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గలా పౌరులుగా సమాచారం అందించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని అన్నారు. భావి జీవితానికి అవరోధంగా నిలుస్తూన్న మత్తు పదార్థాలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బింగించాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను ఉత్తేజ పరిచే విధంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలన అవగాహన 5కె రన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యువత ముఖ్యంగా మతుపదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవలన్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మాహుజన్ మాట్లాడుతూ యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలన్నారు.యువత మత్తుపదార్థాలకు బానిసలై అనారోగ్యం పాలవుతూ బంగారు భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా, ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ తమ చేతులారా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, దానికోసమే ముందుగానే మత్తు పదార్థాలను నిర్మూలించి యువతను మత్తు అనే మహమ్మారి నుండి కాపాడుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం పోలీస్ వారికి అందించాలని పిలుపునిచ్చారు.
జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడానికి డి-ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు మానసిక వైద్యుల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాధకద్రవ్యాల నిర్మూలన అవగాహన 5కే రన్ కి అనూహ్య స్పందన వచ్చిందని త్వరలో జిలాల్లో మారథాన్ పోటీలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు
గత నెల రోజుల నుండి ఈ 5k రన్ నిర్వహణ కోసం కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, యువత ఇలాంటి గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడితే కలిగే అనర్థాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
విజేతలు పోలీస్ స్టేషన్ వారిగా.
ఓపెన్ కేటగిరి.
1.రాహుల్ ,వీర్నపల్లి.
2.విజేయ్ కుమార్, రుద్రంగి.
3.బాలయ్య, వీర్నపల్లి
4.సురేష్, వీర్నపల్లి
5.రజినీకాంత్ , ఎల్లారెడ్డిపేట్
6.వినోద్ కుమార్, రంగినేని ట్రస్ట్.
7.వకిల్ , రుద్రంగి
- రాజు , ఎల్లారెడ్డిపేట్
మహిళ కేటగిరీలో.
1.హారిక , తంగళ్ళపల్లి.
2.మౌనిక, తంగళ్ళపల్లి.
3.విశాల, తంగళ్ళపల్లి.
4.మౌనిక , తంగళ్ళపల్లి.
పాత్రికేయ రంగంలో.
1.రవి కుమార్, ఫోటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ.
పోలీస్ విభాగంలో.
1.దేవరాజ్, DAR రాజన్న సిరిసిల్ల జిల్లా.
2.శంకర్, ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్.
ముఖ్య అతిథులుగా హాజరై విజేతలుగా నిలిచిన 15 మందికి సైకిళ్ళు బహుమతిగా అందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, డాక్టర్ లు, యువతి, యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.