వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకొని భారీ బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం సర్కారు ముఖ్యమంత్రి సహయనిధి కింద ఆర్దిక సహాయం అందిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద 30 మంది లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్దిదారుల కుటుంబాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
RELATED ARTICLES