రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల జడ్పిటిసి గుండం నర్సయ్య ముస్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, మాజీ జడ్పిటిసి సభ్యులు, మాజీ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యులతో కలిసి ముస్తాబాద్ మండల కేంద్రంలో నేడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి…