ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసె్‌స(ఐఈఎస్) పరీక్షల్లో నిజాంపేట్ కార్పొరేషన్‌లోని ప్రగతినగర్‌కు చెందిన దేవనబోయిన తేజస్విని 3వ ర్యాంక్ సాధించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో తేజస్విని జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు కృష్ణకుమారి, వెంకటరావు ఆనందం వ్యక్తం చేశారు. తేజస్విని మాదాపూర్‌లోని నారాయణ పాఠశాలలో 10వ తరగతి, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, గచ్చిబౌలి ఐఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.