రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 60 సంవత్సరాల నేవూరి చంద్రారెడ్డి కనబడటం లేదని అతని కోడలు నేవూరి అనురాధ, ఎల్లారెడ్డిపేట పోలీసులను ఆశ్రయించింది.నిన్న ఫిబ్రవరి 19 వ తారీఖు ఉదయం 05:00 గంటల సమయంలో తన మామ ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళినాడని అప్పటినుండి ఇప్పటివరకు తిరిగి రాలేదని తన మామ గురించి బంధువుల ఇంట్లో, చుట్టుపక్కల వెతికిన తన మామ ఆచూకీ దొరకలేదని అతని ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న కోడలు నేవూరి అనురాధ. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ ఎన్ రమాకాంత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.