ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని గాలం గుట్ట హనుమాన్ ఆలయాన్ని మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు షేక్ గౌస్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల శ్రీను,పందిర్ల సుధాకర్ గౌడ్ తదితరులు కలిసి దర్శించుకున్నారు. బుగ్గ కృష్ణమూర్తి శర్మ ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.