మాజీ మంత్రి BRS వర్కింగ్ ప్రెసిడేంట్ కేటీఆర్ ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కి రాసిన బహిరంగ లేఖలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలతో కలసి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా తాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించండి ఏ సమస్య ఉన్న నాకూ చెప్పండి పరిష్కరిస్తా అన్నారు కానీ ఆరు గ్యారంటీలలో ఏమీ సక్రమంగా అమలు అవడం లేదు గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే తెలంగాణకు రాహుల్ గాంధీ రావాలని అంటున్న కేటీఆర్ మీ ప్రభుత్వం ఉన్నపుడు గడచిన పదేళ్లలో ఎన్ని వాగ్దానాలు చేశారు ఏమి అమలు చేశారో చెప్పాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో స్కాములు చేసింది అంటున్నావ్ అవి ఏవో చెప్పాలి మీ ప్రభుత్వం చేసిన దేశంలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు, అది కాక కరీంనగర్ లొ తీగలవంతెన, ఇందిరా చౌక్, ముక్రాంపుర ఫౌంటెన్ సుందరీకరణలో 1కోటి 80లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేసిన పనులు నాణ్యత లేక గ్రానైట్ రాళ్లు కూలడం, వాటర్ ఫాల్స్ లైట్స్ రాకపోవడం జగమెరిగిన సత్యం అన్నారు. BRS ఎంఎల్ఏ లను మభ్యపెట్టి కొంటున్నారని అంటున్న కేటీఆర్ అలా కొనే సంస్కృతి మీది BRS ఎంఎల్ఏ లు మీ తండ్రీకొడుకుల బాధ పడలేక కాంగ్రెస్ ప్రభుత్వం చెసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఆరు గ్యారంటీ లలో ఐదు అమలులో ఉన్నాయి ఒక్క గృహిణిలకు నెల నెల ఇచ్చే 2500 ఒక్కటి కొంచెం టైం పడుతది మీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పోయింది దీనిని మేము పూడ్చడానికి ఇంత టైం పట్టింది మీరు ఉన్నపుడు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదని ఘాటుగా విమర్శించారు.
నిరుద్యోగ భృతి 3016 రూపాయలు, ముస్లిం మైనారిటీ లకు 12% రిజర్వేషన్, దళితులకు 3ఎకరాల భూమి, లక్ష ఉద్యోగాలు ఇలా చాలా హామీలు ఇచ్చిన మీరు మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తారని 300 రోజులలో చేయలేదని మరియూ 5 ఎండ్లలో తెలంగాణ నాశనం అయితది అంటున్న కేటీఆర్ 10 ఏండ్లలలొ తెలంగాణ మొత్తం అప్పుల కుప్పగా చేసింది మీ ప్రభుత్వం తెలంగాణా పౌరుడు ప్రతి ఒక్కరిపై లక్షరూపాయలకు పైగా అప్పు చేసి పోయిన మీరు మీ ప్రభుత్వం వేరే వారి పై నిందలు వేసే ముందు సిగ్గు ఉండాలి నీకు కేటీఆర్ అని మండిపడ్డారు. బిజెపి వాళ్ళతో దోస్తీ చేసి చీకటి ఒప్పందాలు కుకుదుర్చుకున్న మీకు మా గురించి మాట్లాడే అర్హత లేదని బీజేపీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తాము అని నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ హిందూ ముస్లిం మధ్య తగాదాలు పెట్టి ఓటు రాజకీయం చేస్తు దొంగ చాటుగా EVM మిషన్ లలో టాంపరింగ్ చేస్తు గెలుస్తుంది తప్ప ప్రజల విజయం కాదు నీతి నిజాయితీగా గెలిచేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇకనైనా BRS, BJP పార్టీ నేతలు ప్రజలను తప్పు దోవ పట్టించడం మాని, ఉన్నది ఉన్నటు, లేనిది లేనట్టు మాట్లాడాలని నిందలు వెయ్యడం ఆపాలని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పక్షాన హెచ్చరిస్తున్నానని అన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు నెహాల్ అహ్మద్, చాంద్, ఖాజా ఖాన్, జమిల్, హనీఫ్, అజీం, షబానా మెరాజ్, ఇమ్రాన్, మసోమ్ ఖాన్, షహెన్షా, బషీర్, అజ్మత్, ఖలీల్, జాఫర్, ఖలీద్, తదితరులు పాల్గొన్నారు