రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేట మండలంలోని కోరుట్లపేట సబ్ స్టేషన్ అపరెటర్ నిర్లక్యంతో ఓ గ్రామ అసిస్టెంట్ హెల్పర్ ప్రాణాలు పోయేపరిస్థితి ఏర్పడింది.
విద్యుత్ సరఫరాలో తలెత్తిన లోపాన్ని సరి చేయుటకు కోరుట్లపేట గ్రామ పంచాయతీ అసిస్టెంట్ హెల్పర్ మోకినపల్లి దేవరాజు ట్రాన్స్ ఫార్మర్ పై వుండగానే విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై ట్రాన్స్ ఫార్మర్ పైనుండి క్రింద పడి తీవ్రంగా గాయపడ్డట్లు గ్రామస్థులు తెలిపారు. కోరుట్లపేటలోని సబ్ స్టేషన్ ఆపరేటర్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సబ్ స్టేషన్ కార్యాలయంలోనే విధుల్లో వుంటూ కల్లు సేవిస్తున్నారని ఆ సమయంలోనే అసిస్టెంట్ హెల్పర్ ట్రాన్స్ ఫార్మర్ పై నుండి క్రింద పడి తీవ్రంగా గాయపడ్డడని ప్రత్యక్ష సాక్షి, గ్రామస్థులు ఎల్లారెడ్డిపేట సెస్ ఏ ఈ పృథ్వి దర్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న సమయంలో స్నేహితులతో కలిసి కార్యాలయంలోనే కల్లు త్రాగుతూ నిర్లక్యంగా వ్యవహరించిన సబ్ స్టేషన్ ఆపరేటర్ మూలంగా గ్రామ అసిస్టెంట్ హెల్పర్ ప్రాణాలు కోల్పోవలసి న పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు, రైత్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సమయంలో కల్లు త్రాగుతూ నిర్ల క్ష్యంగా వ్యవహరించిన సబ్ స్టేషన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోవాలని సెస్ అధికారులను గ్రామస్తులు క్షతగాత్రుని కుటుంబ సభ్యులు, బందువులు కోరారు. ట్రాన్స్ ఫార్మర్ పైనుండి కింద పడ్డ అసిస్టెంట్ హెల్పర్ మోకిన పల్లి దేవరాజును గ్రామ మాజీ సర్పంచ్ దేవానందం ఎల్లారెడ్డి పేటలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు.