కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో శ్రీ అయ్యప్ప స్వామి 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తేదీ 22-శుక్రవారం రోజున ఉదయం జమ్మికుంట శివాలయం గుడి నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కోలాట బృందాలతో పురవీధుల గుండా చిన్నపిల్లల వేషధారణలో ఆటపాటలతో గ్రామోత్సవ రథోత్సవం శరణు ఘోషలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం తేదీ 22 శుక్రవారం నుండి. తేదీ 23 శనివారం యాగప్రవేశం. తేదీ 24 ఆదివారం నవ చండీ హోమములు. తేదీ 25 సోమవారం మహా కుంభాభిషేకములు జరుగుతాయని.. ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు తెలిపారు