రైతుల పేరుతో పగటి వేశాలు వేస్తూ గత ప్రభుత్వం పొలం బాట పట్టి రైతుల పైన బీఆర్ఎస్ పార్టీ మెసలి కన్నీరు కారుస్తూ కేసీఆర్ ప్రజల మద్యకు వచ్చిండని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య తీవ్రంగా ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పంటలు ఎండిపోతే రైతులకు కనీసం పావులా, రూపాయన్న ఇచ్చిండా ? వడగళ్ల వాన పడి పూర్తిగా ద్వంసమై పాడైపోయి నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదని ఎద్దేవ చేశారు. ఏ మోహాం పెట్టుకొని నష్టపరిహారం ఇవ్వాలని పొలంబాట పట్టారని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా బీఆర్ ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేక పోవడంతో పొలాల్లో తిరుగుతున్నారని ఎన్నిసార్లు తిరిగిన ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని వేషాలు, ఎన్ని బాగోతాలాడిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను ప్రజల ముందు నిజాయితీగా ఒప్పుకొని ఫోన్ ట్యాపింగ్, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపంపై ప్రజల ముందు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్, బానోత్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్ పాల్గొన్నారు.