Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAజిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన ABVP నాయకులు

జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన ABVP నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన ABVP నాయకులు. ఈ సందర్బంగా ABVP రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజులు మీడియాతో మాట్లాడుతూ DEO ను సస్పెండ్ చేయాలనీ, జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌళిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, స్విపర్స్ లేక ఉపాధ్యయులు ఉడుస్తున్నారని, బుక్స్ డ్రెస్ లు ఈయలేని దుస్థితి, నాణ్యతలేని ఆహారం, కనీస వసతులు కరువు, అద్దె భవనాలలో హాస్టల్స్, దుర్భర పరిస్థితిలో విద్యార్థులు వంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు సంఖ్యకు అనుకూలంగా టీచర్స్ లేని స్థితి, కొన్ని పాఠశాలలో కొన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేని దుస్థితి, అధిక ఫీజులు, బుక్స్ అధిక రేటుకు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులకు కంటికి కనిపిస్తలేదని ప్రయివేట్ పాఠశాలల నుండి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రయివేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ లు అమ్ముతున్నారని కంప్లిట్ చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు ప్రయివేట్ పాఠశాలను ఎందుకు సీజ్ చేస్తలేరని ప్రయివేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ లేవు, DEO దృష్టికి తీసుకెళ్లిన DEO పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్కూళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ప్రయివేట్ పాఠశాలల నుండి డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా MEOనే చెప్పాడని అన్నారు. 13 మండలాలకు ఇద్దరు MEO లు ఉన్నారు. ప్రభుత్వ పాఠాశాలలో విద్యార్థులను తగ్గించడానికి విద్యాశాఖ అధికారులే ప్రయివేట్ పాఠశాలలతో కుమ్మక్కు అయ్యారని ప్రయివేట్ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకోకపొతే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అమరణ దీక్ష చేపడుతామని అనుమతి లేని ప్రయివేట్ పాఠశాలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో జిల్లా విద్యశాఖ అధికారి కి ఫోన్ లు చేయిస్తున్నారు అన్నారు. మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు ఇంత జరుగుతున్న చర్యలు తీసుకుంటలేరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పోరేటు ప్రవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని మరియు అక్రమంగా బుక్స్ డ్రెస్ లు అరికట్టడమ గురించి అలాగే జిల్లాలో యాద్దేచ్చగా నడుస్తున్న చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నరన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల కి విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫామ్ ల), ఇతర మెటీరియల్ ను ఎక్కువ మొత్తానికి విద్యార్ధులకు అమ్ముతున్నారు దాదాపు రూ.1,000 విలువ చేసే ఒకటవ తరగతి పాఠ్యపుస్తకాలను రూ.6 నుండి రూ.8 వేల వరకు హెచ్చించి అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే విద్య వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ రూ. లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో ABVP రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు, ఏబీవీపీ లా ఫోరమ్ విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోప్పెలి రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోoడ్ల తిరుపతి, సోషల్ మీడియా కో కన్వీనర్ పెండ్యాల శివ, వికాస్, ఫణి, కిషోర్, కొప్పుల నవీన్, ఎన్నగందుల శ్రీనివాస్, బూర వెంకటేష్, కార్తీక్, అమర్నాథ్, ధనుష్, మనోజ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments