రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో వ్యాపారులు, ఇతరుల ఇండ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేటలో శనివారం సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో వడ్డీ వ్యాపారం చేసే వారి ఇండ్లలోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. వారి వద్ద నుండి ప్రామిసరి నోట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జవ్వాజి కొమురయ్య, చకిలం మధు, గంప మౌళి, గంప అంజయ్య, తదితరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించడం పట్ల గ్రామస్తుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.