Monday, May 20, 2024
spot_img
HomeCINEMAట్విట్టర్‌ ఖాతా సస్పెండ్‌!

ట్విట్టర్‌ ఖాతా సస్పెండ్‌!

కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు  నటుడు కిశోర్‌. తాజాగా ఆయన  ట్విటర్‌ అకౌంట్‌పై వేటు పడింది. ట్విట్టర్‌లో ‘ఆయన ఖాతా సస్పెండ్‌ అయింది. నిబంధనలు ఉల్లఘించిన కారణంగా సస్పెండ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆయన పేజీని క్లిక్‌ చేస్తే ‘నిబంధనలు ఉల్లంఘించిన వారి ఖాతాలను సంస్థ నిలిపివేస్తుంది’ అనే సందేశం కనిపిస్తుంది. అయితే దీనిని ఎప్పుడు నిలిపివేశారో, దానికి కారణం ఏ ట్వీట్‌ అనేది తెలియాల్సి ఉంది. ఆయన ఖాతాను తిరిగి యాక్టివేట్‌ చేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌మస్క్‌కు నేరుగా రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కన్నడ చిత్రం కాంతారలో కిశోర్‌ కీలక పాత్ర పోషించారు కిశోర్‌. ఫ్యామిలీ మ్యాన్‌, షీ వెబ్‌సిరీస్‌లలోనూ నటించారు. రైతుల కష్టాల గురించి గొంత్తెత్తి మాట్లాడారు. అలాగే ఎన్డీటీవీని అదానీ గ్రూప్‌ దక్కించుకోవడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వ్యతిరేకించారాయన. అలాంటి పోస్ట్‌ల కారణంగా ట్విట్టర్‌ ఖాతా సస్పెండ్‌ అయి ఉండొచ్చని టాక్‌ వినిపిస్తోంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments