ముందుగా రంజాన్ పండుగ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కు జర్నలిస్టులు మున్నా ఖాన్, కృష్ణపల్లి సురేష్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆపద వచ్చిందని చెబితే అర్ధరాత్రి అయిన నేనున్నానంటూ ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా కుటుంబ పెద్దగా జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నా జర్నలిస్టుల సమస్యలపై ఇలాగే నిరంతరం పోరాడాలని న్యాయం దిశగా జర్నలిస్టుల కు భగవంతుడీలా తోడుండలని కోరారు. ప్రజానీకానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మున్నా ఖాన్, కృష్ణపల్లి సురేష్ సర్వ మానవ సమానత్వానికి, ప్రేమ తత్వానికి, శాంతికి రంజాన్ ప్రతీకని అన్నారు. ముస్లింల జీవితాల్లో వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.