Thursday, October 22, 2026
spot_img
HomeUncategorizedసమతా భావం సమానత్వం నిస్వార్ధ సేవకు ప్రతీక గురునానక్ దేవ్: సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

సమతా భావం సమానత్వం నిస్వార్ధ సేవకు ప్రతీక గురునానక్ దేవ్: సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

దేవుడు ఒక్కడే అని ఏక్ఓంకార్ సందేశంతో సమానత్వాన్ని బోధించి మానవాళికి సత్యం, అహింసలతో కూడిన ప్రేమ మార్గాన్ని చూపించిన గురునానక్ దేవ్ జయంతి, గురు పౌర్ణమి పురస్కరించుకుని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నగరంలోని గురుద్వారాను సందర్శించారు. నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సర్దార్ ధన్నా సింగ్ ఆహ్వానం మేరకు గురుద్వారాను సందర్శించిన నరేందర్ రెడ్డి ఆ మహనీయులను స్మరిస్తూ సిక్కు ప్రజలందరికీ గురుపరబ్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురునానక్ జయంతి సందర్భంగా సూడా చైర్మన్ హోదాలో మొదటిసారి గురుద్వారాకు విచ్చేసిన నరేందర్ రెడ్డికి సిక్కు మత గురువులు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయుల నరనరాన దేశభక్తిని పెంపొందించిన గొప్ప వ్యక్తి గురునానక్ అని అన్నారు. భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించిన వ్యక్తి గురునానక్ అని గురునానక్ స్పూర్తితోనే వేలాది మంది సిక్కులు దేశ రక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments