Home TELANGANA ఫంక్షన్ హాల్ నిర్మాణంకై నిజాం చెరువు కాలువ అక్రమ మళ్లింపుతో పేద రైతులకు నష్టం.

ఫంక్షన్ హాల్ నిర్మాణంకై నిజాం చెరువు కాలువ అక్రమ మళ్లింపుతో పేద రైతులకు నష్టం.

0
461

మహబూబాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం చెరువు కట్ట పక్కన నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ కు అడ్డుగా ఉందని అక్కడ ఉన్న కాలువను దారి మళ్లించడం ద్వారా పక్కనే ఉన్న వ్యవసాయ భూములు ప్రతి ఏటా ముంపునకు గురై ఆ భూములకు సంబంధించిన పేద రైతులు నష్టపోతున్నారు. ఈ విషయమై ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులకు ఆ నిర్మాణంపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ముస్లిం సంఘాల JAC రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.

సదరు నిర్మాణం బఫర్ జోన్ లో ఉన్నట్టు అనుమానాలు కూడా ఉన్నాయని నిర్మాణానికి సంబంధించి మునిసిపల్ శాఖలో ఒక రకమైన డిజైన్ కు అనుమతులు తీసుకొని వేరే డిజైన్ తో నిర్మించడంపై కూడా రెండు మూడు రోజుల క్రితం మున్సిపల్ శాఖలో కూడా సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగినట్లు తెలిపారు. బఫర్ జోన్ లో నిర్మాణాలు కొనసాగిస్తే మున్ముందు జరిగే నిర్మాణాలు కూడా బఫర్ జోన్ లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా చెరువు భూములు అక్రమణకు గురి కాకుండా ఈ నిర్మాణానికి కాలువ మళ్లింపు విషయం పై నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి ఈ నిర్మాణాన్ని మొదలే అడ్డుకోవడం ద్వారా భవిష్యత్తులో బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉండవన్నారు అహ్మద్ ఖాన్.

కాలువ మళ్లింపు ద్వారా పేద రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయలేకపోతున్నారని ఆ పేద రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి సంబంధిత అధికారులు మళ్లించిన కాలువను యథా స్థితిలో పునర్ నిర్మించి కాలువను మళ్లించిన యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరుతూ ఏదైతే నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారో అదే విధంగా నిర్మాణం జరగాలని ఇతర నిర్మాణాలు అక్కడ చేపట్టడం చట్టవ్యతిరేకం కాబట్టి అలాంటి నిర్మాణాలు ఏమైనా ఇప్పటికేజరిగి ఉంటే ఆ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల JAC రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here