కెసిఆర్ భగీరథ ప్రయత్నంతో ప్రాజెక్టులను నిర్మించుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శివునికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ పరమ శివుని దయతో కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంతం పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానన్నారు ఈ పర్వదినానీ రాష్ట్ర ప్రజలందరూ ఏంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారని అందరికి శుభం జరగాలని ఆ శివుణ్ణి వేడుకున్నారు