జాతీయ సైన్స్ దినోత్సవము సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ ప్రధానోపాధ్యాయులు మురళీధర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తాము తయారుచేసిన 40 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మురళీధర్, సంజీవ్, రవి, లక్ష్మీబాయి, జయరాం, రాధిక, అనిల్ కుమార్, సంతోష్, మాధవి, సురేష్, అనిల్, కుమార్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.