ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని AMR గార్డెన్స్ లో మున్నూరు కాపు మండల ఆత్మీయ సమావేశాన్ని మండల అధ్యక్షుడు మెంగని రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నుకున్న మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి శంకర్, నామాల పోశెట్టి, సంయుక్త కార్యదర్శి మెంగని మహేందర్, జిల్లా కమిటీ మెంబర్ అల్లం లక్ష్మణ్, గోలి తిరుపతి, జిల్లా అడ్ హక్ కమిటీ సభ్యులు అగ్గి రాములు, దేవరాజు, ఇప్పపూల లక్ష్మణ్ లను ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవయ్య మాట్లాడుతూ తాను మున్నూరు కాపుల అభివృద్ధి కొరకు అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా మున్నూరు కాపులు ఎదగడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి మెంగని మనోహర్, మాజీ జిల్లా కో-ఆర్డినేటర్ శీలం స్వామి, జిల్లా నాయకులు కుక్కల దేవేందర్, బొప్ప నరసయ్య, తోట ధర్మేందర్, బొప్ప శ్రీధర్ మహిళా మండల అధ్యక్షురాలు బొప్ప విజయ, మెంగని స్వర్ణ, బాల్ లక్ష్మీ, మండల నాయకులు కుంట శంకరయ్య, ఆది లక్ష్మణ్, వరద దినేష్, బండి శ్రీనివాస్, దబ్బెడ ఎల్లం, శీలం సుధాకర్, బండి వెంకటయ్య, వరద మల్లేశం, గాండ్ల రవి, మెంగని ఈస్తరి, మెంగని రాజు, బాలయ్య, శ్రీనివాస్, నాగరాజు,గుడెపు దేవేందర్, గుండం ఎల్లం, లక్మన్, వరాల లక్మన్, మరిపల్లి రాములు, వివిధ గ్రామాల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.