బీఎస్పీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపిఎస్ ఇక ప్రజాసేవలో సినిమాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రామకృష్ణ థియేటర్లో జిల్లా నాయకుల సహకారంతో ఈరోజు ప్రదర్శించారు. ఈ సందర్భముగా స్వేరో నెట్వర్క్ జిల్లా జనరల్ సెక్రెటరీ బట్టు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల టీం సభ్యులు సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా బట్టు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా యదార్ధ కథ అని స్వేరో నెట్వర్క్ స్థాపించిన బి.ఎస్.పి పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలసమాహారమని బడుగు బలహీన వర్గాల దళితుల జీవితంలో అభివృద్ధి జరగాలంటే విద్య ప్రధానమైనదని, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని తెలుపుతూ నిర్మించిన ఈ చిత్ర దర్శకునికి మరియు నటీనటులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను, జిల్లాల దేవయ్య, చుంచు బాబు, సూది నవీను, నల్ల సంతోష్, కట్కూరి అంజి, చంటి, జిల్లాల మహేష్, కార్తీక్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు