ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డి సురేష్ సోదరుడు గడ్డి రమేష్(42) ఇటీవల వ్యవసాయ బావిలో పడి మరణించగా విషయం తిమ్మాపూర్ బిఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావుకు తెలియజేయగా మృతుని కుటుంబాన్ని వారం క్రితం పరామర్శించి శుక్రవారం 5 వేల రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు అందచేశారు. బి అర్ ఎస్ కార్యకర్త కుటుంబం ఆపదలో ఉన్నదని తెలిసిన వెంటనే నేనున్నానంటూ ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న జెడ్పిటిసి పెద్దలు చీటీ లక్ష్మణరావు కు తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుండ్ల రాజయ్య, బీమరిశేఖర్, భూక్యరాజ్యానాయక్, బొంబోతుల అంజయ్య, భూక్య లింగంనాయక్, డాకూరి రాజు పాల్గొన్నారు.