హిందూపురం పట్టణంలోని ముస్లిం నగారా కార్యాలయంలో గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ ఏర్పాటు కార్యక్రమం విశిష్ట అతిథి ఖాజీ అన్సార్ ఆధ్వర్యంలో అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. రాష్ట్రంలో ఇమామ్ మౌజన్ ల హక్కుల కోసం ఈ సంస్థ చట్ట బద్దంగా పోరాడుతోందని తెలిపారు. గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ సత్య సాయి జిల్లా అధ్యక్షుడిగా మౌలానా వసీఉల్లాను, గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ హిందూపురం పట్టణ అధ్యక్షుడిగా మౌలానా తన్ వీర్ అహ్మద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి బాధ్యతలు అప్పగించారు. అనంతరంగ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ క్యాలండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉబెదుల్లా హుసేన్, మౌలానా రిజా ఉర్ రహమాన్, మౌలానా ఉస్మాన్ ఘనీ, మౌలానా సాజిద్, మౌలానా షాబుద్దీన్, మౌలానా అన్సారీ, హాజీ నాసీర్ తదితరులు పాల్గొన్నారు
గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ ఏర్పాటు
RELATED ARTICLES