సిరిసిల్ల సభ్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన పసుల కృష్ణను బొప్పాపూర్ ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, మెండె శ్రీ నివాస్ యాదవ్, తదితరులు పాల్గొని శాలువాలు కప్పి సన్మానించారు.


