Tuesday, February 11, 2025
spot_img
HomeTELANGANAమంత్రి కి అడ్డం తిరిగిన కార్యకర్తలు, బుగ్గారం గ్రామస్తులు

మంత్రి కి అడ్డం తిరిగిన కార్యకర్తలు, బుగ్గారం గ్రామస్తులు

బుగ్గారంలో మంత్రిని మండల కార్యాలయాల గురించి ప్రశ్నించిన గ్రామస్థులు, బిఆర్ఎస్ కార్యకర్తలు

జడ్పిటిసి బాదినేని ఆగడాలపై మండిపడ్డ బుగ్గారం. ప్రజా తిరుగుబాటు భయంతో ఇనుప ప్రేమ్ కు శిలాపలకం

బుగ్గారంను బాదినేని రాజేందర్ కు తాకట్టు పెట్టారు

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మండల కార్యాలయాల స్థలాల గురించి ఆదివారం గ్రామస్థులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. బుగ్గారంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. మండల కార్యాలయాలు గ్రామ నడిబొడ్డున గల గడి స్థలంలో నిర్మించాలని గ్రామస్తులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిలదీశారు. జడ్పీటిసి బాదినేని రాజేందర్ మండల కార్యాలయాల కోసం సూచించిన ఎదుల బోర్ల స్థలాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు. చేసేదేమీ లేక మంత్రి సమాధానం చెప్పలేక మిగతా కుల సంఘాల అభివృద్ది పనుల కోసం కారెక్కి వెళ్లారు. గ్రామస్థులు అంతా ముక్త కంఠంతో మంత్రి కార్యక్రమాలకు ఎవరూ హాజరు కావద్దని బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఆగిపోయారు. కార్యకర్తలు లేకుండా, ప్రజలు లేకుండా జడ్పీటిసి బాదినేని రాజేందర్, ఎంపిపి బాదినేని రాజమణి లతో పాటు కొందరు ప్రజా ప్రతినిధులతో మాత్రమే మంత్రి కార్యక్రమాలు నిర్వహించారు.
అంతకు ముందు అంబేడ్కర్ సంఘం భవనం వద్ద శంఖుస్థాపన చేసిన మంత్రిని ఏవి సార్ మీ దళిత బంద్ ఎవరికి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కడ పాయె, మా దళితుల బ్రతుకులు ఏమిటని దళిత మహిళలు ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖం చాటేసుకొని, ఇక మీరే మాట్లాడుకొండి అంటూ వెళ్లి పోయారు.
జడ్పీటిసి బాదినేని రాజేందర్ సూచించిన ఎదుల బోర్ల స్థలంలోనే ప్రజల తిరుగుబాటు భయంతో గద్దె కట్టకుండా దొంగ చాటుగా ఇనుప ప్రేమ్ కు శిలాఫలకం పెట్టి ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఆదివారం మండల ప్రజా ప్రతినిధులు శంఖుస్థాపన చేయించారు. తహశీల్దార్ అని సోయి కూడా లేకుండ ఎమ్మార్వో అని శిలాఫలకం పై లిఖించడం సిగ్గు చేటు అని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల శంఖుస్థాపనకు బుగ్గారం గ్రామస్తులు, కార్యకర్తలు హాజరు కాకపోవడం అధికార పార్టీ బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. పలు విమర్శలకు దారితీసింది. అంతా బాదినేని రాజేందర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు బాహాటంగా బస్టాండ్ లో ముచ్చటించారు. బుగ్గారం గ్రామ పాలకులు, ప్రజా ప్రతినిధులు గత మే నెల 5న (05-05-2023) నిర్వహించిన బుగ్గారం గ్రామ సభ తీర్మానాలను తుంగలో తొక్కి గ్రామ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసి, అందరినీ నమ్మించి మోసం చేసి, బుగ్గారం గ్రామాన్ని బాదినేని రాజేందర్ కు తాకట్టు పెట్టారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments