తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వే బుధవారం మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ ప్రారంబించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియార్ అసిస్టెంట్లు, సి ఎల్ ఆర్పిలు, అర్పీలు సర్వేలో భాగంగా పట్టణంలోని వార్డులలో ఇంటింటా తిరుగుతూ స్టిక్కర్స్ అంటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ మాట్లాడుతూ సర్వే చేసేటప్పుడు ఎటువంటి దుష్పాచారాలు ప్రబలకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి ఫోర్స్ లేకుండా, తప్పిదాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు మేనేజర్ జి రాజిరెడ్డి,D నరేష్, టీపివో శ్రీధర్, ప్రదీప్ కుమార్, అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, వాణిలతో పాటు పలువురు పాల్గొన్నారు.