కష్టపడి పని చేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల జమ్మికుంటకు చెందిన యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన సజ్జద్ మహమ్మద్ అని కాంగ్రెస్ కార్యకర్తలకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు చెప్పారు. బుధవారం హుజురాబాద్ పార్టీ ఆఫీసులో ఇటీవల నూతనంగా హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన మహమ్మద్ సజ్జును స్వీట్ తినిపించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రానున్న రోజుల్లో ప్రతి స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పిస్తామని కార్యకర్తలు చేస్తున్న కష్టాన్ని అధిష్టానం చూస్తుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్న మహమ్మద్ సజ్జును అందరూ ఆదర్శంగా తీసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రంజాన్ యాట్ల అశోక్, పింగిలి రమేష్, దొడ్డే నవీన్, గోపాల్ రావు, శబొద్దీన్, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దౌలత్, NSUI కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫర్వేజ్, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విష్ణుదాసు వంశీ, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు కల్లపల్లి వినోద్, అష్రఫ్ అలీ, రాజ్ కుమార్, సోహెల్, సల్లు బాబా మురళి తదితరులు పాల్గొన్నారు.