సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. విచిత్రమైన వీడియోలు రూపొందించి ఎక్కువ వ్యూస్, లైక్స్ తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు చేయడం, ప్రమాదకర స్టంట్లు చేయడం, పబ్లిక్ వాహనాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లూ పడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో మధ్య వయస్సు మహిళ చేసిన పని చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది
@ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ బైక్‌పై రివర్స్‌లో కూర్చుంది. బైక్ వేగంగా వెళ్తుండగా ఆమె వెనక్కి తిరిగి కూర్చుని ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తోంది. వెనుక బైక్ మీద వచ్చే వ్యక్తి ఆ దృశ్యాన్ని రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బిజీగా ఉన్న రోడ్డుపై అలా చేయడం చాలా మందికి ఆగ్రహం కలిగిస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌కు నెంబర్ ప్లేట్ లేదు. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు.
ఆ మహిళ ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తుండగా వెనుక బైక్ మీద వస్తున్న వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. అతడు కూడా ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అలాగే తన బైక్ మీద కూర్చోవాలని అడిగాడు. ఆ వ్యక్తి బైక్‌కు కూడా నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.