రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి అనుకొని ఉన్న తుర్కాశి పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసింబి (28) కి జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు జజ్జరి దేవేందర్ గ్లూకోస్ లు, సూదులు, గోలీలు ఇచ్చి చంపాడని బంధువుల ఆరోపణ. ఖాసింబి కి భర్త అజీమ్ (32) ఇద్దరు పిల్లలు 1) అజిత్ (8) సుల్తాన్ బి (4) ఉన్నారు వివరాల్లోకి వెళితే ఖాసింబి కి శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు జజ్జరి దేవేందర్ వద్దకు 5:20 నిమిషాలకు చేరుకున్నారు. ఖాసింబి కి పలు పరీక్షలు చేసి గ్లూకోజ్ పెట్టాలి అని గ్లూకోస్ పెట్టి, అందులో ఇంజక్షన్లు ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఖాసింబి కి చేతులు మంటలు పుట్టాయి. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువై చలి ఎక్కువ అయింది. వైద్యుడు ఏమి కాదని గ్లూకోస్ స్పీడును పెంచి రెండు గోళీలు వేసుకోమని మంటలు చలి తక్కువ అవుతుందని తెలిపారు. మరల ఆర్ఎంపి వైద్యుడు రెండు గ్లూకోస్లు ఖాసింబి కి ఎక్కించాడు. మరల ఒక గోలి ఇచ్చి వేసుకోమన్నాడు చలి బాగా వేస్తుందని ఖాసింబి తెలిపింది తన వద్ద ఉన్న రెడ్ బల్బు వేసి ఏమి కాదు అమ్మ వెచ్చగా ఉంటుంది పడుకోమ్మని తెలిపాడు 20 నిమిషాల తర్వాత ఖాసింబి కళ్ళు మీదికి పోవడం మాట మాట్లాడడం ఆగిపోయింది. ఆర్.ఎం.పి దేవరాజు ఖాసింబి చాతి మీద ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. బంధువులను కాళ్లు చేతులు రాయమని తెలిపాడు. కాసింబి చనిపోయే స్థితిలో ఉంది అని తెలుసుకొని పేషెంట్ ను తన కారులో ఎక్కించుకొని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.
ప్రైవేటు హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు వైద్య పరీక్షలు చేసి ఈమె బతకడం చాలా కష్టం కొనఊపిరితో ఉంది అని ఆర్ఎంపి వైద్యునిపై కోపానికి వచ్చి నిరాకరించాడు. ఆర్ఎంపి వైద్యుడు దేవరాజు దయచేసి ఎలాగైనా బతికించండి నాకు ప్రాబ్లం అవుతుంది సార్ అని బ్రతిమాలాడు. ఖాసింబి బంధువులు కూడా బ్రతిమలాడి హాస్పిటల్లో చేర్పించారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం మేము మీ ఒత్తిడి మేరకు ప్రయత్నం చేస్తాము కానీ చనిపోతే మాకు సంబంధం లేదని ఆర్ఎంపి వైద్యుడు దేవరాజు మరియు బంధువుల రోదనలు చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కానీ నేడు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఖాసింబి మరణించింది అని తెలుసుకొని ఆర్ఎంపి వైద్యుడు జజ్జరి దేవరాజు హాస్పిటల్ నుండి పరారయ్యాడు. ఖాసింబిని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎంపి వైద్యుడు జజ్జరి దేవరాజ్ పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కీర్తిశేషులు ఖాసింబి నిరుపేద కుటుంబానికి చెందినవారు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వేడుకుంటున్నారు



