2026లో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తమ వివరాలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు తమ యొక్క పాస్పోర్ట్ ఫోటో, పాన్ కార్డు, ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, బ్యాంకు పాసుబుక్ తో https://hajcommittee.gov.in వెబ్ సైట్ నందు జులై 31 తేదీ లోపు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబరుకు సంప్రదించాలన్నారు.


