రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆప్కారి శాఖ సీఐ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మండల యువజన అధ్యక్షుడు బానోతు రాజు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతూ అనిల్ నాయక్ శాలువా కప్పి సన్మానించారు. తమ పరిధిలో ఉన్న గుడుంబా ఆధారిత కుటుంబాలను ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వానికి విన్నవించాలని, అంతేకాకుండా తమ విధుల ద్వారా ప్రజలను ప్రభుత్వాలను సరి సమానంగా పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాలలో మద్యం బెల్ట్ షాపులు అనధికార వ్యాపారం ఎవరు చేసినా వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు.