జగిత్యాల జిల్లా అర్బన్ మండల్ తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ అడుతుండగా ప్రకాష్ అనే యువకుడు కోడిగుడ్డు విసరడంతో పక్కింటి రిషి ఇంటిపై పడడంతో ఎందుకు వేశారని రమ కొడుకు రిషి, ఆమె అడగడంతో రిషిపై ప్రకాష్ దాడి చేశాడు. ఘర్షణలో ప్రకాష్ అనే యువకుడు కొడవలితో రిషి తల్లి రమ పై దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుండి కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె ఈరోజు చికిత్స పొందుతూ మరణించారు