రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముదురుకోల సత్తవ్వ తనభర్త ముద్ర కోలా వెంకటేశం ఐదేళ్ల క్రితం చనిపోవడంతో పుట్టినిల్లు అయినా గొల్లపల్లి గ్రామంలో ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉండగా అందులో పెద్ద కూతురు పెళ్ళికి దాతల వద్ద సహాయం పొంది వివాహం చేసింది. గొల్లపల్లి గ్రామంలో ఉన్న ఆమెకు ఇప్పుడు సహాయం చేసేవారు లేక తన తన పూసల వృత్తి అయిన గాజుల గంప ఎత్తుకొని ఊరు ఊరు తిరుగుతూ తన ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది. తనకు ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదని నాకు సొంత ఇల్లు కూడా లేదని రోధిస్తుంది. ఇప్పుడున్న ఇద్దరు కూతుర్లలో చిన్న కూతురు పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో కుర్చీకే పరిమితమైంది. తనకు తన కుటుంబ పోషణ భారం ఎక్కువ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక విలవిల్లాడుతుంది. తనకు గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు అక్కడివే ఉన్నా ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని ఎంతమంది అధికారులకు చెప్పిన స్పందించడం లేదని రోధిస్తూ చెబుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని తన చిన్న కూతురు అంగవైకల్యంతో బాధపడుతుందని తనకి వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతుంది