రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం సమికృత సంక్షేమ బాలుర వసతి గృహంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతాన్ని ఆలపించి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు. అనంతరం వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరారు. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యతోపాటు జ్ఞానం పెంపొందించుకోవాలని స్మార్ట్ ఫోన్ ల చెడు అలవాట్లకు చెడ్డవారికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆటపాటలతో తమ ఉపన్యాసాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు