కంటోన్మెంట్ 8వ వార్డ్, బొల్లారంలోని హోలి ట్రినిటి చర్చి నుంచి ఆర్మీ కాంపౌండ్ వరకూ 25 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అభివృద్దికి అన్ని విధాల సహకరిస్తున్నారని అందుకే కంటోన్మెంట్ లో గతంలో పోల్చుకుంటే అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి కంటోన్మెంట్ ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన హామిని నెరవేర్చుతూ తమ ప్రాంతంలో రోడ్డు నిర్మిస్తున్నందుకు స్థానికులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కదిర్వన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలరాజు, నరహరి, ప్రేమ్ కిరణ్, ముఖేష్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.


