రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ ఆలయంలో నిన్న రాత్రి దొంగలు దేవత యొక్క పుస్తెలు మరియు ముక్కుపుడక ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళ్తే యధావిధిగా ప్రతిరోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో కోల నరేష్ అనే వ్యక్తి భక్తి గీతాల పాటలు పెట్టి అనంతరం దేవాలయాన్ని శుభ్రపరిచేవాడు నేడు దేవాలయానికి వెళ్లేసరికి దేవాలయం యొక్క గేటు తెరచి ఉండేసరికి వెంటనే కులస్తులకు అట్టి విషయాన్ని తెలియజేశారు. ఆలయంలో పెద్దమ్మ మెడలో పుస్తెలు ముక్కుపుడక ఎత్తుకెళ్లినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు