రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిర్యాల కార్ సాయికృష్ణ (25) అనే యువకుడు ప్రమాదవశత్తు గిద్ద చెరువులో పడి చనిపోయాడు. (బుధవారం) సాయి కృష్ణ ఎప్పటిలాగే ఉదయం మేకలు కాయడానికి వెళ్లగా తన మందలోని ఒక మేక ప్రమాద వశత్తు గిద్ద చెరువులో పడగా సదరు మేకను కాపాడడానికి సాయి కృష్ణ ప్రయత్నించగా మేక చిక్కుకున్న ఊబిలో సాయి కృష్ణ పడి ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై తన బృందంతో సాయి కృష్ణ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకి తరలించారు కుమారుని మరణ వార్త విన్న తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పండుగ పూట ఎల్లారెడ్డిపేట గాంధీ ఏరియాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు