Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
జమ్మూలో భారీ ఎన్‌కౌంటర్‌ - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeNATIONALజమ్మూలో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూలో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సిధ్రా ప్రాంతంలోని తవీ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో భద్రతాబలగాలు అనుమానాస్పదంగా ఉన్న ఓ ట్రక్కును గుర్తించి, తనిఖీల కోసం నిలిపివేశాయి. ఆ సమయంలో ట్రక్కు డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పారిపోగా, అందులో దాక్కుని ఉన్న నలుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపి, వారిని మట్టుబెట్టాయి. వారి వద్ద నుంచి 7 ఏకే 47 రైఫిళ్లు, ఓ ఎం 4 రైఫిల్‌, మూడు పిస్తోళ్లు, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments