Saturday, July 13, 2024
spot_img
HomeTELANGANAరైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది, తప్పక ఆదుకుంటాం

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది, తప్పక ఆదుకుంటాం

మీరు చేసిన అవినీతి ఆక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మీరు చేసిన ఫోన్ టాపింగు ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపం పై మీరు జైలుకు వెళ్లడం ఖాయం. అయ్యా కొడుకులు చేసిన తప్పుకు కాంగ్రెస్ పార్టీని నిందించడం సిగ్గుచేటు అన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ వడగళ్ల వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వందేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మట నరసయ్య అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించి అధికారులను పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని ఆదేశించారని వారు గుర్తు చేశారు. పొలం బాట పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెలంగాణలో రైతులను చాలా మట్టుకు మోసం చేసింది ఎవరంటే కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చెప్పడం కేసీఆర్ కే సాద్యమని కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా మాట్లాడుతుందన్నారు, గత వర్షాకాలంలో వర్షపాతం తక్కువగా ఉన్నదనే విషయం కెసిఆర్ తో పాటు మనందరికీ తెలుసు సుందిళ్ల, మెడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి 60 టీఎంసీల నీరు సముద్రం పాలు చేసిన ఘనత కేసిఆర్ దేనని మధ్య మానేరుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అందులో ఉన్న నీటిని 12, 13 ప్యాకేజీ కాలువల ద్వారా సిద్ధిపేట, మెదక్ కు, నీ ఫామ్ హౌస్ కు తీసుకపోతివి, నీ కొడుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని 9వ ప్యాకేజీ మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేయకపోగా అక్కడే పడావు చేస్తిరి, ఈ విధంగా అయ్యా కొడుకులు చేసిన తప్పుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిందించడం సిగ్గుచేటు అనే విషయం అని వారు అన్నారు.

బిఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు వర్షాలకు కొట్టుకపోయి ఎండలకు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వీఆర్ఏ, వీఆర్వోల చేత నష్ట పరిహారం అంచనా వేసి కాగితాలకే పరిమితం చేసి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని వారు తీవ్రంగా విమర్శించారు. మా ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది పకృతి వైపరీత్యాల వలన రైతులు కొంతవరకు నష్టపోయిన మాట వాస్తవమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం రైతులకు ఇస్తామని ప్రకటించారని రైతులను తప్పకుండా ఆదుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేసి ఆర్భాటం కోసం పొలం బాట పట్టిందే తప్ప రైతులకు వారు చేసేది ఏం లేదని అన్నారు. పోన్ ట్యాపింగ్, ప్రాజెక్టు నిర్మాణాలలోపం పలు అవినీతి ఆక్రమాల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పందిళ్ళ లింగం గౌడ్, నేవూరి రవీందర్ రెడ్డి, నంది కిషన్, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి, రఫీక్, రావుల ముత్యం రెడ్డి, వడ్నాల ఆంజనేయులు, ముద్దుల శ్రీ పాల్ రెడ్డి, దోమ్మాటి రాజు, సిరిపురం కిషన్, బీపేట రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments