తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ ని నేడు ఆవాజ్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, గద్వాల జిల్లా కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు బాలికల డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.
వినతి పత్రంలోని ప్రధానాంశాలు:
రెసిడెన్షియల్ బాలుర పాఠశాల: నిరుపేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పించేందుకు నూతనంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలి.
బాలికల డిగ్రీ కళాశాల: మైనారిటీ యువతుల ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా, ప్రత్యేకంగా మైనారిటీ బాలికల డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలి.
ఈ విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లోని మైనారిటీ వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆవాజ్ కమిటీ వివరించింది. ఆవాజ్ కమిటీ విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ విద్యా రంగంలో మైనారిటీలను ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వినతి పత్రంలోని అంశాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా ఈ విద్యాసంస్థల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ ముఖ్య నాయకులు, అతికూర్ రెహమాన్, మహమ్మద్ రహమతుల్లా, యూసుఫ్ బిన్ నాసర్, MD.చాంద్ పాషా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


