నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా నియోజకవర్గంలోని 7వ వార్డు గన్ రాక్ టీచర్స్ కాలనీలో ఇటీవల పర్యటించిన సందర్భంలో కాలనీ వాసులు తమ పార్క్ ను అభివృద్ధి చేసి, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, తాగునీటి ఇబ్బందులు తొలగడానికి పవర్ బోర్ వెల్ వేయించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అంచనాలు తయారు చేయించి, కంటోన్మెంట్ బోర్డు నుండి అనుమతులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓపెన్ జిమ్, నూతన పవర్ బోర్ వెల్ వేయించారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీగణేష్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ పార్క్ ను అభివృద్ధి చేసి, ఓపెన్ జిమ్, నూతన పవర్ బోర్ వెల్ లను ఏర్పాటు చేయించినందుకు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని, అందరూ కలిసి అభివృద్ధి చెందాలని నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట చేపట్టిందే సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడానికని, ఇది తన బాధ్యత అని, మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఇలాగే తనపై ఉండాలని వారితో చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
మురళి ముదిరాజ్, నాగినేని సరిత, రంగా, రవీందర్ గుప్తా, కాలనీ వాసులు నవీన్, ప్రభు, అశోక్, గోకుల్, జూడ్ తదితరులు పాల్గొన్నారు


